దసరాలోపు వరంగల్‌లో నాలాలపై ఆక్రమణల తొలగిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరం ముంపునకు గురైంది. మంగళవారం మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి పర్యటించారు. అనంతరం కేటీఆర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
దీనిలో భాగంగా దసరా నాటికల్లా నాలాలపై ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తామని... మరోసారి ముంపునకు గురికాకుండా ఉండాలంటే ఈ చర్యలు తప్పవని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపులో రాజీపడేది లేదని.. ఎవరున్నా ఉపేక్షించబోమని తెలిపారు. దీని కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీ కూడా వేశామని మంత్రి వెల్లడించారు.
పేదవాళ్లు ఎవరైనా ఉంటే వారికి కచ్చితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని... ఆక్రమణల తొలగింపునకు అందరూ సహకరించాలని కోరారు. వరదలను రాజకీయం చేయొద్దని.. ఈ సమయంలో తప్పుడు ప్రచారాలు తగవని హితవు పలికారు. టీమ్ వర్క్‌తో పనిచేసి వరదల్లో ప్రాణనష్టం లేకుండా చేశామన్నారు.
ఇదీ చూడండి: నోయిడా పవర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం