ఈ నెల 17వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాకు రానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హన్మకొండలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్‌లతో మంత్రి సమావేశమయ్యారు. కేటీఆర్ పర్యటనపై చర్చించారు.
అంతకు ముందు కేటీఆర్ ప్రారంభించే మినీ ట్యాంక్‌బండ్ , అంబేడ్కర్ నగర్లో ప్రారంభించనున్న 590 రెండు పడక గదుల గృహ సముదాయాలను, పోతన జంక్షన్‌ను, కేంద్రీయ కారాగారం వద్ద నిర్వహిస్తున్న నర్సరీని మంత్రి పరిశీలించారు. ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున కొవిడ్-19 దృష్ట్యా వేదిక, సీటింగ్, వాహనాల పార్కింగ్ మొదలగునవి ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి దయాకర్ రావు ఆదేశించారు. కరోనా వైరస్ నేపథ్యంలో నాయకులు, ఇతరులు రాకుండా సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి: 80 శాతం మొక్కలు బతక్కపోతే చట్టపరమైన చర్యలు: కేటీఆర్