అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు రాష్ట్ర మునిసిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ను కోరారు. వరంగల్ నగరానికి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రెటరీని మేయర్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ముఖ్యమంత్రి హామీ నిధులకు చెందిన అభివృద్ధి పనుల బిల్లులను చెల్లించాలని కోరారు.
పారిశుద్ధ్య నిర్వహణ కోసం పట్టణ ప్రగతి నిధులతో 268 వాహనాలను కొనుగోలు చేశామని... వాటికి డ్రైవర్లను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు అనుమతి ఇవ్వాలని కోరగా... ప్రిన్సిపల్ సెక్రెటరీ స్పందించి మంజూరు చేస్తానని తెలిపారు.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు 40% మించిపోకూడదనే నిబంధనలు ఉన్నందున... మిగతా వేతనాలను ప్రభుత్వం భరించేలా చూడాలని తెలిపారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపితే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రిన్సిపల్ సెక్రెటరీ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : వచ్చే నెలలో టీ-వర్క్స్ ప్రారంభమౌవుతాయి: కేటీఆర్