ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి వహించాలి: మందకృష్ణ - updated news on mandakrishna madiga

ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం సరికాదని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి వహించి ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

Mandakrishna demands for The central government should be sanctioned on reservation
కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి వహించాలి: మందకృష్ణ
author img

By

Published : Feb 20, 2020, 11:52 AM IST

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ప్రదర్శించి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వరంగల్​లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదనడం సరికాదన్నారు. న్యాయవ్యవస్థ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉండే రక్షణ చట్టాలను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలోనూ అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

రిజర్వేషన్లు అమలులో ఉన్న చోట అంతా సవ్యంగానే జరుగుతుందని.. లేని చోట మాత్రం ఉన్నత వర్గాల ఆధిపత్యం కొనసాగుతుందని అన్నారు. దేశంలో సామాజిక అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్ల అమలు జరగాలని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి వహించాలి: మందకృష్ణ

ఇదీ చదవండి: ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో భారత్​వి ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.