కొవిడ్-19 కారణంగా శానిటైజర్లకు మార్కెట్లో డిమాండ్‌తోపాటు ధరలు కూడా పెరిగిపోయాయి. అయితే డబ్ల్యుహెచ్వో నిబంధనలకు అనుగుణంగా మన ఇంట్లోనే శానిటైజర్లను తయారు చేయవచ్చని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా వివరించారు. నిట్ కెమిస్ట్రీ ఆచార్యుడు రామచంద్రయ్య ఆ తయారీని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు.
75 ఎమ్ఎల్ ఐసో ప్రొపైల్ ఆల్కహాల్, 1.5 ఎమ్ఎల్ గ్లిసరిన్, 0.5 ఎమ్ఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాలకు 20 ఎమ్ఎల్ నీరు లేదా డిస్టిల్ వాటర్లను కలపడం ద్వారా సొంతంగా నాణ్యమైన శానిటైజర్‌ని తయారు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. శానిటైజర్ అందుబాటులో లేని వారు సబ్బుతో తరచూ చేతులను శుభ్రపరచుకోవాలన్నారు. కళ్లు, ముక్కు, నోరు వంటి భాగాలను తాకకుండా ఉండాలని ఆయన సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, బయటికి వెళ్లినప్పుడు ఇతరులతో కనీస దూరాన్ని పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.
ఇదీ చూడండి : ఔషధాల లేమి... పొంచి ఉన్న ప్రమాదం