ETV Bharat / state

Low Temperatures in Telangana: పెరుగుతున్న చలి తీవ్రత.. బయటకొచ్చేందుకు జంకుతున్న ప్రజలు - low temperatures records in telangana

Low Temperatures in Telangana: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు వణికిపోతున్నారు. సాయంత్రం అయ్యిందంటే ఇంటి నుంచి బయట కాలుపెట్టలేని పరిస్థితి నెలకొంది. రాత్రి ఎనిమిది గంటలు దాటితే రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. బస్టాండులోనూ రహదారులపైనా యాచకులూ, వృద్ధులు చలికి గజగజ వణికిపోతున్నారు.

Low Temperatures in Telangana
Low Temperatures in Telangana
author img

By

Published : Dec 24, 2021, 6:31 AM IST

Low Temperatures in Telangana: పెరుగుతున్న చలి తీవ్రత.. బయటకొచ్చేందుకు జంకుతున్న ప్రజలు

Low Temperatures in Telangana: రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సాయంత్రం 7గంటల నుంచే వణుకు పుట్టిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బీర్పూరు మండలం కొల్వాయిలో రాత్రి ఉష్ణోగ్రత 7.1, గుల్లకోటలో 7.6, మల్యాలలో 7.8 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయింది. ఉదయం బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో చలి ప్రతాపం..

కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో 9 గంటల వరకు కూడా చలి తీవ్రంగానే ఉంటోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చలి తన ప్రతాపాన్ని చూపుతుంది. రాత్రి, ఉదయం పూట చలి ఎక్కువగా ఉంటుండడంతో ప్రజలు ఉన్ని దుస్తులు ఉంటే కానీ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల మంటలు పెట్టుకొని చలి కాచుకుంటూ కనిపిస్తున్నారు.

దుప్పట్లు ఉన్నా..

వరంగల్‌ జిల్లాలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. రాత్రి పూట ప్రయాణం చేసే వారు చలితో ఇబ్బందులు పడుతున్నారు. యాచకులు.. చలితో అనేక అవస్థలు పడుతున్నారు. దుప్పట్లు ఉన్నా చలికి తట్టుకోలేక పోతున్నారు. చలిగాలులు వణికిస్తుండటంతో స్వెట్టర్ల అమ్మకాలు హనుమకొండలో ఊపందుకున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేలా రంగు రంగుల స్వెట్టర్లు, టోపీలు ఇతర దుస్తులను వ్యాపారులు అందుబాటులో ఉంచారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ఉత్తరభారతం నుంచి వచ్చే గాలుల ప్రభావంతో రాత్రిపూట చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

ఇదీచూడండి: Harish Rao On omicron: 'ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు బూస్టర్​ డోస్​ కోసం కేంద్రానికి లేఖ రాశాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.