వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వామపక్షాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విజయసారధిరెడ్డి ఆరోపించారు. కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా పీవోహెచ్ కావాలని కేంద్రానికి లేఖ ఎలా రాస్తారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా కాజీపేట్ రైల్వేస్టేషన్ ముందు నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో రాష్ట్రానికి కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని విజయసారధిరెడ్డి హెచ్చరించారు.