వరంగల్‌లోని కాకతీయ జంతు ప్రదర్శనశాలలోని స్రవంతి అనే ఆడ చిరుత మరణించింది. గత కొంత కాలం నుంచి ఇది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని జూ సిబ్బంది తెలిపారు. ఆఖరి నిమిషం వరకు చిరుతను బతికించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.
చిరుత గత కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతోందని జూ అధికారులు తెలిపారు. కడుపు నొప్పి తదితర కారణాలతో తిరగలేని, ఆహారం తీసుకోలేని పరిస్ధితికి చేరిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి గురువారం ప్రత్యేకంగా వచ్చిన వైద్యులు ఆఖరి నిమిషం వరకూ కూడా చిరుతను బతికించేందుకు ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయిందని వివరించారు.
ఇదీ చదవండి: పారిశుద్ధ్య కార్మికుల నిర్లక్ష్యంతో కేబుళ్లు దగ్ధం!