వరంగల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఇవాళ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరారు. నగరంలోని రుద్రమదేవి కూడలిలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. యువకులు పెద్ద సంఖ్యలో కమలం గూటికి చేరారు. తెలంగాణలో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం భాజపా అని ఆయన పునరుద్ఘాటించారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి గారు ప్రజలు నవ్వుతున్నారు: లక్ష్మణ్