పతంగులు ఎగురవేస్తుంటే కలిగే ఉత్సాహం అంతా ఇంతా కాదు. సంక్రాంతి పండుగ రోజుల్లో పెద్దలు.. పిల్లలతో పోటీ పడుతూ.. పతంగులు ఎగురవేేస్తారు. ఇంద్ర ధనుస్సు రంగుల్లో వైవిధ్య భరితంగా రూపుదిద్దుకున్న గాలిపటాలు వరంగల్ వీధుల్లో కనువిందు చేస్తున్నాయి.
మారుతున్న కాలంతో పోటీ పడుతూ... సరికొత్త డిజైన్లతో కొనుగోలుదార్లను ఆకర్షించేలా పతంగులు తయారు చేస్తున్నారు. మానవాళికి కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారిని గుర్తు చేస్తూ... రూపొందిన పతంగులూ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇదీ చూడండి: యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన యాడా వైస్ ఛైర్మన్