రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం... ఈరోజు జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది. మళ్లీ నిర్వహించేందుకు కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
మిగిలిన పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ముందుగా నిర్ణయించిన తేదీలలోనే యథాతథంగా నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెల్లడించారు.