Janakipuram Sarpanch sexual harassment issue: నేటి ప్రపంచంలో మహిళలు అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణించాలి. కొందరు వారికి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సాధిస్తున్నా.. చాలా వరకు వేధింపులు ఎదుర్కొంటున్నారు. తమ కంటే ఉన్నత స్థానంలో, అధికారంలో ఉన్న వారి నుంచి మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురి అవుతున్నారు.
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడని ఇటీవల సర్పంచ్ నవ్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మహిళా కమిషన్ స్ఫందించింది. ఘటనను సుమోటోగా తీసుకోవాలని ట్విటర్ వేదికగా వచ్చిన అభ్యర్థనకు స్ఫందించిన కమిషన్... రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రకటించింది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి స్వయంగా డీజీపీకి ఈ విషయంపై విచారణ జరపాలని కోరుతూ లేఖ రాసినట్టు స్ఫష్టం చేసింది.
అసలేం జరిగిందంటే.. మహిళా దినోత్సవం మరుసటి రోజునే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు.. అధికార పార్టీ ప్రజాప్రతినిధిపై ఓ మహిళా సర్పంచ్ ఆరోపణలు చేశారు. ఆ నేత తనను లైంగికంగా వేధిస్తున్నాడని.. దీంతో తాను మనో వేదనకు గురవుతున్నట్లు సర్పంచ్ ఆవేదన వెలిబుచ్చారు.హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచి కురసపల్లి నవ్య మీడిాయా ముందు వ్యాఖ్యలు చేశారు.
ధర్మసాగర్‌కు చెందిన ప్రముఖ నాయకుల్లో.. ఓ ఎమ్మెల్యే తన కోరిక తీర్చమంటూ రోజూ మానసికంగా వేధించేవాడని నవ్య ఆరోపించారు. ఆ నాయకుడు చెప్పిన దానికి ఒప్పుకోకపోవడంతో జానకిీపురం గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధుల్లో వివక్ష చూపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు గ్రామంలో జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని తెలిపారు.
నేతల కోరికలు తీర్చేందుకు రాజకీయాల్లోకి రాలేదని నవ్య తెలిపారు. వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నేతలదే అధికారం అని ఆరోపించారు. నియోజకవర్గంలో పార్టీ నాయకత్వం రెండు మూడు వర్గాలు ఉండటం వలన అభివృద్ధివేగం కుంటుపడిందని విమర్శించారు. గత నెలలో మంత్రి కేటీఆర్ పర్యటించినప్పుడు ఓ మహిళా నాయకురాలు తనను అవమానించారన్నారు. ఇప్పటికైనా తనను వేధిస్తున్న నాయకుడు... మహిళలతో మంచిగా వ్యవహరించాలని హితవు పలికారు.
ఇవీ చదవండి:
- చేసిన పనులకు బిల్లులు రాక.. చేయాల్సిన పనులకు నిధులు లేక.. సర్పంచ్ల అష్టకష్టాలు
- పూజల పేరుతో మహిళల నగ్నచిత్రాలు తీసిన ముఠా అరెస్టు.. పరారీలో ప్రధాన నిందితుడు
- పొలం పని చేస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ
- కేసీఆర్ పాలనపై కిషన్‌రెడ్డి ట్వీట్.. బీజేపీ సన్నాసులకు అర్థం కాదంటూ కేటీఆర్ కౌంటర్
- ప్రియుడి కోసం దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్‌హోస్టెస్.. నాలుగో అంతస్తు నుంచి దూకి..