వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ప్రభుత్వ కళాశాలలోని మూల్యాంకన కేంద్రం వద్ద లెక్చరర్లు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్నందున ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంటే ఇంటర్ అధికారులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. కరోనా భయంతో విధులు కూడా సరిగ్గా నిర్వహించలేమని మూల్యాంకనాన్ని వాయిదా వేయాలని కోరారు.
ఇవీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు