ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఊపందుకున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి సూదగాని హరి శంకర్ గౌడ్ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం నడకకు వచ్చిన వారిని కలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని హామీ ఇచ్చారు.
ప్రధాన పార్టీ అయిన తెరాస ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టి ప్రచారం చేస్తుంటే...స్వతంత్ర అభ్యర్థులు చాప కింద నీరులా ప్రచారం చేసేస్తున్నారు. నిరుదద్యోగులను కలుస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇదీ చూడండి: అహింసతో స్వతంత్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారు : సీఎం కేసీఆర్