తెలంగాణలో కాంగ్రెస్, భాజపాలకు మనుగడ లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్.. హసన్‌పర్తి మండలంలో ఆ పార్టీల నుంచి యువకులు, నాయకులు, కార్యకర్తలు 150మంది వరకు ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో చేరారు.
కంటికి రెప్పలా..
ఈ చేరికలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తనను నమ్మి వచ్చిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. వంగపహాడ్ గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చూడండి: ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది: మంత్రి హరీశ్‌రావు