ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు చెట్టును ఢీ కొట్టడం వల్ల ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని పంతని శివారులో జరిగింది. ఇల్లందు గ్రామానికి చెందిన రామ్ సాయి, వర్ధన్నపేటకు చెందిన మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి ద్విచక్ర వాహనంపై వరంగల్ వైపు వెళ్తున్నారు. అతివేగంతో బైక్ను అదుపు చేయలేక చెట్టును ఢీ కొన్నారు. పోలీసులు మృత దేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: నేడు తేలనున్న ఇంటర్ ఫలితాల వివాదం