ICET 2022 Notification 2022- 23: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2022- 23 ఐసెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబ్రాది, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రమేష్ విడుదల చేశారు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐసెట్ నోటిపికేషన్‌ను విడుదల చేశారు. మొత్తం 14 రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేశామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.
ఏప్రిల్ 6 నుంచి.. జూన్ 27 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. రూ.1000 అపరాధ రుసుముతో జులై 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. జులై 27, 28 రెండు రోజుల పాటు పరీక్ష నిర్వహిస్తామని ఛైర్మన్ తెలిపారు. పరీక్ష ఫలితాలను ఆగస్టు 22న విడుదల చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి పాల్గొన్నారు.
PGECET Notification 2022- 23: అదేవిధంగా ఎంటెక్, ఎంఫార్మసీలో ప్రవేశాల కోసం పీజీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 12 నుంచి జూన్ 22 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. ఆలస్య రుసుంతో జులై 10 వరకు ఈసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది.
ఇదీ చదవండి: Jeevan Lite: ఐఐటీ హైదరాబాద్ పరిశోధకుల ఏడాదిన్నర కృషి ఫలితం.. "జీవన్ లైట్"