ETV Bharat / state

కిందపడ్డ మహిళను ఆస్పత్రికి చేర్చిన కమిషనర్​! - వరంగల్​ మహా నగర పాలక సంస్థ

విధి నిర్వహణకై వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడ్డ మహిళను కారు ఆపి ఆస్పత్రికి చేర్పించారు వరంగల్​ కమిషనర్​ పమేలా సత్పతి. వరంగల్​ నగరంలోని నాలాలాపై అక్రమ నిర్మాణాల తొలగింపు పరిశీలనకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

HWMC Commissioner Helps Women Who Fell Down With Bike
కిందపడ్డ మహిళను ఆస్పత్రికి చేర్చిన కమిషనర్​!
author img

By

Published : Aug 23, 2020, 7:52 PM IST

వరంగల్​ మహానగర పాలక సంస్థ కమిషనర్​ పమేలా సత్పతి విధి నిర్వహణలో తన మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్​ పట్టణంలోని నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలను పరిశీలించడానికి వెళ్తున్న క్రమంలో హన్మకొండలోని తిరుమల బార్​ జంక్షన్​ వద్ద ఓ మహిళ ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కమిషనర్​ వెంటనే కారు ఆపి.. స్వయంగా తన కారులో ఆ మహిళను ప్రైవేట్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుటుంబీకులకు సమాచారం అందించి ఆమెకు చికిత్స చేయించి వెళ్లారు. విధి నిర్వహణలో ఉండగా.. రోడ్డు మీద జరిగిన ప్రమాదం పట్ల స్పందించి మానవత్వాన్ని ప్రదర్శించిన కమిషనర్​ను అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.