వరంగల్ పట్టణ జిల్లాలో ఉష్ణోగ్రతలు ప్రాణాలు తీసేంతగా మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా చూస్తే 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. బయటకు వెళ్తే సూరీడు భగ్గుమంటున్నాడు. ఇంట్లో ఉన్న ఎండ వేడిమికి ప్రజలు తట్టుకోలేక... ఉక్కబోతకు ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు బేజారువుతున్నారు. భరించలేని ఎండ వేడిమికి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమైనా పనులున్నా ఉదయం పూటనే చేసుకుంటున్నారు.
ఇవీ చూడండి: ధీర వనితలు... పుడమి కాంతులు