భారీ వర్షంతో ఓరుగల్లు నగరం తడిసి ముద్దవుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వానతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి.. వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
రోజంతా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లాయి. డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. లోతట్టు ప్రాంతల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
ఇదీ చదవండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్