వరంగల్ పట్టణ జిల్లా కేంద్రం, కాజిపేటలో ప్లాస్టిక్ వినియోగదారులపై మహా నగర పాలక సంస్థ అధికారులు జరిమానా విధించారు. డాక్టర్ రాజిరెడ్డి ఆకస్మికంగా 52, 53 డివిజన్లలో పర్యటించి పారిశుద్ధ్యం సరిగా లేనందున 52 డివిజన్ జవాన్‌కు రూ.2 వేలు, 53 డివిజన్ జవాన్ నుంచి రూ.3 వేలు అపరాధ రుసుం వసూలు చేశారు. శానిటరీ సూపర్‌వైజర్ సాంబయ్య ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి దుకాణదారులపై మొత్తం రూ.36,300 జరిమానాలు విధించారు.
ఒక్కరోజులోనే రూ.70వేలకు పైగా...
కాజిపేటలో పండ్ల మార్కెట్ ప్రాంతంలోని పలు దుకాణాలతో పాటు, వెంకట్రామ జంక్షన్ ప్రాంతంలో శ్రీరామ హోటల్, సోమిడి ప్రధాన రహదారి ప్రాంతంలో కిరాణా, మిఠాయి దుకాణదారులు ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు విక్రయిస్తూ... వాటిని ఉపయోగించి స్థానిక మురుగుకాలువల్లో పడేయడం వల్ల వ్యర్థాలు పేరుకుపోతున్నందున వారిపై రూ.33,300 జరిమానాలు విధించారు. ఒక్క రోజులోనే బల్దియా అధికారులు రూ.70 వేల పైచిలుకు అపరాధ రుసుం వసూలు చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో పలుచోట్ల ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు