ఉగాది నుంచి ప్రతి ఇంటికి నల్లా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ తెలిపారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రూ.155.53 కోట్ల పనులకు ఆమోదం లభించింది.
గ్రేటర్ వరంగల్ అభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చడానికి 270 యంత్రాలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో 38 కూడళ్లను అధునాతన హంగులతో గ్రీనరీలుగా తీర్చి దిద్దుతున్నట్లు వెల్లడించారు. ప్రతి కార్పొరేటర్ వారివారి డివిజన్లలో సత్వర అభివృద్ధికి రూ.27 లక్షల పనులను నామినేషన్ పద్ధతిన కేటాయించినట్లు మేయర్ తెలిపారు.