ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రతిపక్షాల నాయకులు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఉద్యోగాలపై పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
తెరాస హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కొందరు నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమానికి పట్టభద్రులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.