వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని భద్రకాళీ అమ్మవారిని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకుడు శేషు వివరించారు.
రోడ్డు మార్గాన కిల్లాకోట సందర్శన
గవర్నర్ రాకతో ఆలయ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులను లోనికి అనుమతి ఇవ్వకుండా ఆలయ ప్రధాన గేటు వద్ద బస్సులను నిలిపేశారు. భద్రకాళి ఆలయం నుంచి గవర్నర్ దంపతులు రోడ్డు మార్గం ద్వారా కిల్లాకోట ను సందర్శించనున్నారు. సౌండ్ అండ్ లైటింగ్‌తో పాటు కాకతీయ కట్టడాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షో చూస్తారని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి : ఉరి తాళ్ల తయారీకి ఆర్డర్- 'నిర్భయ' దోషుల కోసమేనా?