ధరణి పోర్టల్‌లో ప్రతి ఒక్కరూ తమ ఆస్తులను నమోదు చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా భూవివాదాలను శాశ్వతంగా పరిష్కరించడానికే ఆస్తుల నమోదు ప్రక్రియను సీఎం కేసీఆర్ చేపట్టారని ఆయన తెలిపారు. హన్మకొండలో దాస్యం వినయ భాస్కర్ ఆస్తుల నమోదుకై ఆయన క్యాంపు కార్యాలయానికి మున్సిపల్ అధికారులు వచ్చారు. వినయ భాస్కర్ వారి కుటుంబ ఆస్తుల వివరాలను తెలియజేసి ధరణి పోర్టల్‌లో నమోదు చేయించారు.
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్‌తో పాటు వరంగల్ ఎంపీ దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య తమ ఆస్తులను ధరణిలో నమోదు చేసుకున్నారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ కోరారు.
ఇవీ చూడండి: అప్పుడు కరవు పొమ్మంది... ఇప్పుడు ఉపాధి రమ్మంది