వరంగల్ నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రహదారులు సహా ముంపు ప్రాంతాలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ పరిశీలించారు. హన్మకొండలోని నాయిమ్ నగర్, సుబేదారి, వంద ఫీట్ల రోడ్లను సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. డ్రైనేజీలు, నాలాలను ఎప్పటికప్పుడు ప్రోక్రైన్తో క్లీన్ చేయాలని సూచించారు. ద్వారకా నగర్లో వరద ప్రవాహంలో చిక్కుకున్న ఓ వృద్ధురాలిని కేయూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవపై తీసుకొచ్చాయి.
![ముంపు ప్రాంతాలను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-02-17-chip-vip-visit-damages-roads-av-ts10077_17082020154309_1708f_1597659189_930.jpg)