వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ ఛీప్ విప్, ఎమ్మెల్యే వినయభాస్కర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ఎంపీ దయాకర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్, వరంగల్ మేయర్ పాల్గొన్నారు. కొవిడ్ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలను సాదా సీదాగా అధికారులు జరిపారు. ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన దేశ నవ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్ తెలిపారు.
ఇదీ చూడండి:గల్వాన్ లోయ యోధులకు శౌర్య పతకం!