వరంగల్ పట్టణ జిల్లాలో ఆయిల్ గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. తమిళనాడు నుంచి కమలాపూర్‌లోని హెచ్‌పీ గ్యాస్ బాట్లింగ్ ప్లాంటుకు తీసుకొస్తుండగా... గూడూరు వద్ద ట్యాంకర్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో బోల్తాపడింది. హుజూరాబాద్, వరంగల్‌కు చెందిన... అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకొన్నాయి.
స్వల్పంగా లీక్..
ట్యాంకర్ నుంచి స్వల్పంగా గ్యాస్‌లీక్ అవుతున్నట్లు గుర్తించారు. ట్యాంకర్ బోల్తాపడిన రహదారిపై పోలీసులు భారీకేడ్లు అమర్చి... అటువైపుగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఆయిల్ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.