కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్అప్ కౌన్సెలింగ్కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు.
ఖాళీల వివరాలను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.
ఇవీ చూడండి: మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల