వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. యూరియా కోసం అన్నదాతలు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్- పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతకొన్ని రోజుల నుంచి యూరియా కోసం ఎదురుచూసిన రైతులు.. అధికారుల తీరుతో విసిగి నిరసనకు దిగారు.
ఇవీ చూడండి: వరంగల్‌లో బజరంగ్దళ్ నాయకుల అరెస్ట్