తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీరని బాధను మిగిల్చింది. మొత్తం 26 మంది సురక్షితంగా బయటపడగా.. అందులో కొందరు వరంగల్ మ్యాక్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
'అందరమూ ఈత వచ్చినవాళ్లమే.. లైఫ్ జాకెట్లుంటే అంతా బతికేవాళ్లం'.... 'ప్రమాదకరమైన మార్గమని కాస్త ముందు చెప్పినా జాగ్రత్త పడేవాళ్లం'.... 'బోటు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే మా మిత్రులను కోల్పోయాం'.... 'కచ్చులూరు గ్రామప్రజలకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం'.... కేటీఆర్, ఎర్రబెల్లి, పువ్వాడ ఇతర ప్రజాప్రతినిధులు మమ్మల్ని ఆదుకున్నారంటూ మృత్యుంజయులు తమ అనుభవాలను ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
ఇదీ చదవండిః విజృంభిస్తున్న విషజ్వరాలు... నేలపైనే రోగులకు చికిత్స