ETV Bharat / state

పురుడు పోయాలంటే చేతిలో పైసా పడాల్సిందే - edit

ప్రతి పనికో రేటు.. రేటును బట్టే పని ఇదేదో అంగడిలో జరిగే వ్యవహారం కాదు. స్వయాన పేదలకు పెద్దదిక్కైన ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్వాకం.  గేటుదాటి లోపల అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగొచ్చే వరకూ పైసా ఇవ్వనిదే పనిజరగదు.  ప్రభుత్వాసుపత్రుల్లో ఇంతవరకూ  దోమలే రక్తం పీల్చేస్తాయని మనకు తెలుసు.. కాని  వరంగల్​ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పపత్రిలో అడుగడుగునా పాతుకు పోయిన లంచావతారాలు పేద ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు.

పురుడు పోయాలంటే చేతిలో పైసా పడాల్సిందే
author img

By

Published : May 10, 2019, 12:01 AM IST

పురుడు పోయాలంటే చేతిలో పైసా పడాల్సిందే

ప్రసవం కోసం ఆస్పత్రికొచ్చారా... చేయి ముట్టుకోవాలంటే వంద రూపాయలు సమర్పించాల్సిందే. ఇక సెక్యురిటీ దగ్గర నుంచి ఆపరేషన్​ థియేటర్​లోని నాలుగో తరగతి ఉద్యోగుల వరకు చేయి తడపందే అడుగు ముందుకు పడదు. అంతే కాదండోయ్​.. ఇక్కడ పిల్లలను బట్టి కూడా ధర నిర్ణయించి బంధువులకు బంఫర్​ ఆఫర్​ ఇస్తున్నారు.

పుట్టిన పిల్లలను బట్టి రేటు

మగపిల్లాడయితే 1500, ఆడ పిల్లయితే 1000 చెల్లించాల్సిందేనట. అక్రమాలకు అడ్డాగా మారి తమ చేతివాటంలో పేదల పాలిట జలగల్లా మారి ఆస్పత్రి పేరును మంటగలుపుతున్నారు హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి వైద్య సిబ్బంది.

పేరు చెడగొడుతున్నారు..

ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గర్భణీలకు మంచి వైద్యం అందిస్తారని పేరుంది. నిత్యం ఇరుగు పొరుగు జిల్లాల నుంచి సుమారు 200 మందికి పైగా వస్తుంటారు. నిత్యం 25 పైగా ప్రసవాలు జరుగుతాయి. ఓ వైపు వైద్యులు రికార్డు స్థాయిలో ప్రసవాలు చేసి ప్రశంసలు పొందుతుంటే మరోవైపు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పారిశుద్ధ్య కార్మికుల నుంచి సెక్యురిటీ వరకూ కాన్పుకోసం వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ అపఖ్యాతి తీసుకొస్తున్నారు.

పైసా ఇవ్వనిదే పని జరగదు

అడిగినంత ఇవ్వకుంటే పట్టించుకునే వాడే ఉండడు. ప్రమాదవశాత్తూ పిల్లలు చనిపోయినా వారి నుంచి కూడా వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో తెలుసుకోవాలి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పుట్టిన బిడ్డను తాకాలంటే అక్కడున్న వారికి రూ.500 చెల్లించాలి. పసికందును శుభ్రం చేయాలంటే డబ్బు ఇవ్వాల్సిందే. మొత్తం అన్నీ పూర్తిచేసుకుని బిడ్డతో బైట పడేసరికి మూడు నుంచి ఐదు వేలు పిండేస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జలగల్లా పీడిస్తోన్న సిబ్బంది నుంచి తమకు విముక్తి కలిగించాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి: తల్లి ఒడికి చేరిన సంగారెడ్డి శిశువు

Intro:Body:

edit

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.