జేఈఈ పరీక్షల్లో కాజీపేటకు చెందిన విద్యార్థి సత్తాచాటాడు. ఎస్టీ కేటగిరిలో మూడో ర్యాంకు సాధించిన అరుణ్‌తేజ్.... కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతోనే ప్రతిభను చాటుకున్నట్లు వెల్లడించారు. కొవిడ్ పరిస్థితుల్లో అధ్యాపకులు ఎంతో సహకారం అందించారని.... ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువగా సాధన చేశానంటున్నాడు.
మంచి ర్యాంకు కోసం రోజుకు 12గంటలకు పైగా శ్రమించానని... ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధమైనట్లు తెలిపాడు. ఎవరికి వారు వేసుకున్న ప్రణాళికతోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తామంటున్న జేఈఈ ర్యాంకర్ అరుణ్‌తేజ్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇవీచూడండి: ఐఐటీ, జేఈఈ ఫలితాల్లో అల్ఫోర్స్ జయభేరీ