వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల, శ్రీరాములపల్లి గ్రామాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి ఈటల జమున నేరెళ్ల గ్రామానికి చేరుకున్నారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. గ్రామ ప్రజలు, నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈటల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. గ్రామంలోని నాయకులతో కలిసి పలు వీధుల్లో ర్యాలీ చేపట్టారు.
ఇంటింటా తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందంటూ విమర్శించారు. భాజపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు వివరించారు. ప్రజల అభిమానానికి ఆమె కృతజ్ఞతలు చెప్పారు. రానున్న ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: RAGHUNANDAN RAO: పోలీసుల అదుపులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు