ETV Bharat / state

Minister Errabelli: కాన్వాయ్​ని అడ్డుకున్న ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు - హన్మకొండ వార్తలు

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్​ని ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు అడ్డుకున్న ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. 14 నెలలుగా జీతం చెల్లించడం లేదని.. కారణం కూడా చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

employment-guarantee-field-assistants-blocked-minister-errabelli-dayakar-rao-convoy-at-hanamkonda
Minister Errabelli: కాన్వాయ్​ని అడ్డుకున్న ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు
author img

By

Published : Jun 19, 2021, 12:38 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండ సర్య్కూట్‌ గెస్ట్‌ హౌస్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి ఎర్రబెల్లి క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

14 నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదని క్షేత్ర సహాయకులు నిరసన తెలిపారు. ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగారు. ఖంగుతిన్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి... మంత్రిని పంపించారు. ఎన్నిసార్లు మంత్రికి విన్నవించుకున్నా.. పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్యోగాన్ని నమ్ముకుని 14 సంవత్సరాలుగా పని చేస్తున్నామని.. అలాంటిది 14 నెలలుగా మాకు జీతం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏమి చెప్పకుండా మా జీవితాలతో ఆడుకుంటున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చూడండి: Anasuya: యాంకర్​తో అనసూయ గొడవ.. షో నుంచి బయటకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.