ETV Bharat / state

కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధనలో పోరుకు సిద్ధమైన ఉద్యోగులు - telangana varthlau

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనలో ప్రత్యక్ష పోరుకు రైల్వే కోచ్‌ డివిజన్‌ పోరాట సమితి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద నాయకులు ఆందోళన చేపట్టనున్నారు. కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాదంటూ రైల్వే శాఖ చేసిన ప్రకటన ఉపసంహరించుకునేవరకూ తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేస్తున్నారు.

కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధనలో పోరుకు సిద్ధమైన ఉద్యోగులు

author img

By

Published : Mar 24, 2021, 4:55 AM IST

కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధనలో పోరుకు సిద్ధమైన ఉద్యోగులు

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం రైల్వే కోచ్ సాధన సమితి చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. కొత్త కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదంటూ రైల్వే శాఖ ఇటీవలే స్పష్టం చేయడంపై భగ్గుమన్న కాజీపేట రైల్వే ఉద్యోగ, విశ్రాంత, ఇతర ప్రజాసంఘాల ప్రతినిధులు డివిజన్ పోరాట సమితిగా ఏర్పడి ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించారు. కాజీపేట, వరంగల్, హన్మకొండల్లో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. తెరాస, కాంగ్రెస్ నాయకులు కూడా వీరి ఆందోళనకు మద్దతిచ్చి జిల్లాలో ధర్నాలు చేశారు. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోచ్‌ ఫ్యాక్టరీతో పాటు కాజీపేట్ డివిజన్‌ కూడా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగుల కల సాకారం కోసమే..

పోరులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేయనున్నారు. ఏప్రిల్ 5న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతామని కోచ్‌ ఫ్యాక్టరీ సాధన సమితి ప్రతినిధులు వెల్లడించారు. వేలాది మంది నిరుద్యోగుల కల సాకారం కోసమే ఈ ఉద్యమమని న్యాయ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల నేతలు కూడా తమతో కలసి వచ్చి చిత్తశుద్దిని చాటుకోవాలన్నారు.

పెద్ద ఎత్తున నిరసన దీక్షలు

సాధన సమితి తరఫున ప్రతినిధులు, ఉద్యోగులు... మొత్తం మూడు వేల మంది ఈ ధర్నాలో పాల్గొననున్నారు. ధర్నాలో పాల్గొనడానికి ఇప్పటికే కొంతమంది హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ దీక్ష తర్వాత కాజీపేట పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సమితి ప్రతినిధులు సన్నద్ధవుతున్నారు.

ఇదీ చదవండి: బడ్జెట్‌ పద్దులపై నేడూ శాసనసభలో కొనసాగనున్న చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.