వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ ఉద్యోగుల విభజన స్థానికత ప్రాతిపదికన మాత్రమే జరగాలని డిమాండ్ చేస్తూ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ ఎదుట విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. నల్ల బ్యాడ్జిలు ధరించి.. విధులను బహిష్కరించి వారు నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేయొద్దని డిమాండ్ చేశారు. ఒకవేళ ఏపీ విద్యుత్ ఉద్యోగులు తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఉద్యోగులను తెలంగాణకు పంపటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏపీ విద్యుత్ సంస్థలు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను వారు దహనం చేశారు.
ఇవీ చూడండి: కరోనా @110: భారత్‌ను కలవరపెడుతోన్న కొవిడ్-19 కేసులు