ETV Bharat / state

ETELA RAJENDER: 'రాజీనామా చేస్తేనే దళితబంధు వచ్చింది.. సీఎం బయటకొచ్చిండు' - telangana varthalu\

ఆత్మగౌరవం కోసం ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేశానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన ఈటల.. తాను రాజీనామా చేయడం వల్లే దళిత బంధు, పింఛన్లు, నిధులు వెల్లువలా వస్తున్నాయని వివరించారు.

ETELA RAJENDER: 'రాజీనామా చేస్తేనే దళితబంధు వచ్చింది.. సీఎం బయటికొచ్చిండు'

author img

By

Published : Aug 31, 2021, 5:40 AM IST

తాను పార్టీ మారలేదని.. తనకు తానుగా రాజీనామా చేయలేదని ముందు ఆరోగ్యశాఖ మంత్రిని తీసేశారని.. ఆ తర్వాత మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆత్మగౌరవం కోసం ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేశానని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించిన ఈటల రాజేందర్‌.. తాను రాజీనామా చేస్తే దళిత బంధు, పింఛన్లు, నిధులు వెల్లువలా వచ్చాయని.. తాను రాజీనామా చేస్తే డీడీలు కట్టి ఏళ్లు గడిచినా రాని గొర్రెలు వచ్చాయని.. ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి బయటికి వచ్చి దళితులతో కలిసి భోజనం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తాను మంత్రిగా ఎమ్మెల్యేగా చేయలేని పనులు రాజీనామాతో చేయగలిగానన్న సంతృప్తి మిగిలిందని అన్నారు. త ఏడేళ్ల కాలంలో అంబేడ్కర్ బొమ్మకు ముఖ్యమంత్రి దండ వేశారా.. జైభీం అన్నారా అని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పనులన్నీ రాజీనామా చేస్తేనే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. మొన్నటి వరకు అన్యాయం జరిగిందని ఏడ్చిన హరీశ్​ రావు.. అన్ని మరిచిపోయి తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

నా ఆత్మగౌరవం కంటే ఎమ్మెల్యే పదవి గొప్పదేం కాదని మీ దగ్గరికి వచ్చా. నాకు ఎడమ భుజం, కుడి భుజం లేకపోవచ్చు.. నా చెల్లెళ్లు నేనున్నా అని దీవించారు. మా యువకులు మేము ఉన్నమని బాసటగా నిలిచారు. పేద ప్రజల గొంతుకై కొట్లాడుతా. రాజీనామా చేస్తేనే దళితబంధు వచ్చింది. రాజీనామా చేస్తేనే పింఛన్​ వచ్చింది. రాజీనామా చేస్తేనే ప్రగతి భవన్​ నుంచి బయటకొచ్చిండు ముఖ్యమంత్రి. రాజీనామా చేస్తేనే మొట్టమొదటి సారిగా దళితులతో కలిసి బువ్వ తిన్నడు. ఈటల రాజేందర్​ అనే బక్కోడు రాజీనామా చేస్తే ఇన్ని వచ్చినయి. గెలిస్తే ఎన్ని వస్తాయి అంటుండు. -ఈటల రాజేందర్​, మాజీ మంత్రి

ETELA RAJENDER: 'రాజీనామా చేస్తేనే దళితబంధు వచ్చింది.. సీఎం బయటికొచ్చిండు'

ఇదీ చదవండి: CM KCR: రేపటి నుంచి మూడు రోజులు సీఎం దిల్లీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.