వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండ హంటర్రోడ్ పరిధిలోని ఓ వృద్ధాశ్రమంలో న్యూ తెలంగాణ మ్యారేజ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అనురాధ బెస్త... మానసిక దివ్యాంగులకు పండ్లను అందించారు. లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లు ఆగిపోవడం, వివాహ పరిచయ వేదికల ప్రతినిధులకు ఆర్థికంగా నష్టమని అనురాధ అన్నారు.
సమాజ హితం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను ప్రజలు తప్పకుండా పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేయాలంటే భౌతిక దూరం పాటించాలని సూచించారు. బయటకు వెళ్తే మాస్కు తప్పనిసరిగా ఉపయోగించాలని మరో ప్రతినిధి పల్లవి కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 40 కరోనా కేసులు నమోదు