inavolu jatara: హనుమకొండ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించికున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. నేటి ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు వైభవంగా జరిగే మల్లన్న జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగేశ్వరరావు తెలిపారు.
మాస్కు ధరించిన వారికే ప్రవేశం
covid rules in temple: కొవిడ్ నిబంధనల మేరకు మాస్కులు ధరించిన వారికే ఉంటుందని ఆలయంలోకి ప్రవేశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మాస్కు ధరించిన వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రత
police security in temple: ఐనవోలు మల్లికార్జున స్వామి వారి జాతరకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఐనవోలుకు వచ్చే 5 ప్రధాన దారుల వద్ద ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జాతరలో దాదాపు 500 మంది పోలీసులు విధుల్లో ఉంటారని పర్వతగిరి సీఐ తెలిపారు. బందోబస్తులో పాల్గొనే పోలీసులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.
స్వామివారి జాతరకు వచ్చే దారులు, ఆలయ పరిసరాల్లో సుమారు 100కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు అదే దారిలో పార్కింగ్ స్థలాలు పోలీసులు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.