ETV Bharat / state

హన్మకొండలో ఘనంగా 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు.. - వరంగల్​ అర్బన్​ జిల్లా తాజా వార్త

67వ అఖిల భారత సహకార వారోత్సవాలను వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోసం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పనిచేస్తుందని ఛైర్మన్​ రవీందర్​ రావు పేర్కొన్నారు.

dccb varostavalu at hanamkonda in warangal urban district
హన్మకొండలో ఘనంగా 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు..
author img

By

Published : Nov 14, 2020, 4:55 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వీటిని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ రవీందర్ రావు జెండా ఆవిష్కరించి ప్రారంభించారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రైతుల అభివృద్ధి, శ్రేయస్సు కోసం డీసీసీబీ బ్యాంకు పని చేస్తుందని ఛైర్మన్ పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకు టర్నోవర్​ వెయ్యి కోట్ల దాటిందని.. మరో 1000 కోట్ల టర్నోవర్ చేరేలా కృషి చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: బాణాసంచా వ్యాపారాలపై కరోనా దెబ్బ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.