వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్‌ని మరింత పటిష్ఠంగా అమలు చేయనున్నట్లు వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు. ఇటీవలే ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనానికి సీపీ రవీందర్ స్పందించారు. నగరంలోని ఎంజీఎం కూడలి వద్ద స్వయంగా కమిషనర్ వాహనాలను తనిఖీ చేశారు. అనవసరంగా రోడ్డెక్కిన వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ఆయా వాహనాలను ఠాణాకు తరలించాలని అధికారులకు సూచించారు.
మరింత కట్టుదిట్టం...
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో లాక్ డౌన్ అమలు తీరుపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్‌ని మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. సీపీ రాకతో అప్రమత్తమైన సిబ్బంది... వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేశారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య