వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని పున్నమి గెస్ట్‌హౌస్‌లో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని సీపీ తరుణ్ జోషి ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ కేంద్రంలో చికిత్స పొందొచ్చని సీపీ సూచించారు.
ఈ కేంద్రంలో 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. అంబులెన్స్, భోజన, తాగునీటి వసతి కల్పించినట్లు సీపీ తెలిపారు. అత్యవసర పరిస్థితి ఉన్న వారికి ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీ జనార్దన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు'