తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామాల్లో సైతం కరోనా పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమాదేవరపల్లి మండలం ముల్కనూర్లోని కొచ్చేరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్న రెండు వందల మంది కూలీలకు మండల వైద్యాధికారులు, ఆశ కార్యకర్తలు కరోనా పరీక్షలను నిర్వహించారు.
జిల్లా పాలనాధికారి ఆదేశానుసారం ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మండల వైద్య అధికారులు తెలిపారు. 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చిందని, కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా నిర్ధరణ అయితే తగిన మందులు వెంటనే వాడితే కరోనాను త్వరితగతిన నివారించవచ్చని వైద్య అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: child trafficking: పిల్లల దత్తత పేరుతో దర్జాగా మోసాలు!