వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాచకులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య విభాగం సహకారంతో సుమారు 200 మంది యాచకులు, వారి కుటుంబసభ్యులకు టెస్టులు చేశారు. వైరస్‌ను నియంత్రించడంలో అందరికి బాధ్యత ఉందని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. యాచకులకు కరోనా పరీక్షలపై అవగాహన లేదని.. ఇది దృష్టిలో ఉంచుకొని వైద్యశాఖతో కలిసి నగరంలోని యాచకులకు టెస్టులు నిర్వహించామని తెలిపారు.
యాచకులతో కొవిడ్ విస్తరించే ప్రమాదం ఉందన్న సీపీ, వారికి వైరస్‌పై అవగాహనతో పాటు మాస్కులు అందిస్తున్నామని వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. పోలీసుల ఆధ్వర్యంలో త్వరలోనే యాచకులకు టీకాలు వేయిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్‌న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!