ETV Bharat / state

ఉమ్మడి వరంగల్​ జిల్లాపై కరోనా పంజా... ఆదివారం 231 పాజిటివ్ కేసులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్ మహానగరం తర్వాత అత్యధిక కేసులు జిల్లాలోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు ఎక్కువుగా చేస్తుండటం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు.

ఉమ్మడి వరంగల్​ జిల్లాపై కరోనా పంజా... ఆదివారం 231 పాజిటివ్ కేసులు
ఉమ్మడి వరంగల్​ జిల్లాపై కరోనా పంజా... ఆదివారం 231 పాజిటివ్ కేసులు
author img

By

Published : Aug 9, 2020, 1:21 PM IST

చారిత్రక నగరంగా ఖ్యాతిగాంచిన ఉమ్మడి ఓరుగల్లు జిల్లాపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతోంది.

తాజాగా ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లాలో 71 కరోనా కేసులు నమోదుకాగా... వరంగల్ గ్రామీణ జిల్లాలో 40 పాజిటివ్ కేసులను వైద్య అధికారులు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 21 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. జనగాం జిల్లాలో 78 పాజిటివ్ కేసులను గుర్తించగా... ములుగు జిల్లాలో మరో 21 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 231కు చేరుకున్నాయి.

శుక్రవారం ఒక్కరోజే 187 కేసులు...

శుక్రవారం అత్యధికంగా 187 కేసులు ఒక్క రోజే నమోదైందంటే వైరస్ వ్యాప్తి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. ఇప్పటివరకు నాలుగో స్ధానంలో ఉన్న వరంగల్... తాజాగా నమోదైన కేసులతో హైదరాబాద్ తర్వాతి స్థానంలోకి వచ్చినట్లైంది.

గత మూడు రోజుల నుంచి...

గత 3 రోజులుగా వరుసగా 142,128,127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్​డౌన్ సడలింపుల తర్వాత జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మొదట్లో రోజుకి 40 నుంచి 50 కేసులు వస్తే... ఆపై 80 నుంచి 100 వరకు నమోదయ్యాయి. ప్రస్తుతం 140 నుంచి రెండు వందలకు చేరువవడం సగు మనిషికి ఆందోళన కలిగిస్తోంది. కుటుంబంలో తొలుత ఒకరికి రావడం... వారి నుంచి మిగతా వారికీ వ్యాపించడం ఎక్కువగా జరుగుతోంది. పెళ్లిళ్లు... ఇతరత్రా వేడుకలు జరగడం... వాటికి హాజరైనవారికి... రెండు రోజుల్లోనే లక్షణాలు కనిపించి వైరస్ బారిన పడడం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

నిర్థారణ లోగానే వ్యాప్తి...

పరీక్షల్లో నిర్ధారణ జరిగే లోగానే వైరస్ ఇతరులకు వ్యాపిస్తుండటం సహా రోజు రోజుకీ పాజిటివ్​గా నమోదయ్యేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఎంజీఎం ఆసుపత్రికీ కరోనా లక్షణాలతో వచ్చే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కొవిడ్ వార్డు, దాని అనుబంధ వార్డుల్లో ప్రస్తుతం 258 మంది చికిత్స పొందుతున్నారు. కాలు బయటపెట్టకుండా కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటున్నా.... మరికొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కేసుల సంఖ్యను పెంచుతోంది.

ఇప్పటివరకూ 2 వేల కేసులు...

వరంగల్ అర్బన్ జిల్లాలో ఇప్పటివరకూ రెండు వేల కేసులు నమోదయ్యాయి. 73 మంది మృత్యువాత పడ్డారు. గతంతో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద పరీక్షలను ముమ్మరం చేశారు. ఒక్క రోజులో సుమారు 1100 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు పెరగడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందని జిల్లా వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 17,336 ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు జిల్లాకు వచ్చాయి.

7 సిద్ధం... మరో నాలుగింటికి అనుమతి...

పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందించేందుకు... ఇప్పటికే నగరంలో 7 ఆసుపత్రులు సిద్ధంగా ఉండగా తాజాగా మరో 4 ఆసుపత్రులు ముందుకువచ్చాయి. ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించి నిబంధనల మేరకు వీటికి అనుమతులు మంజూరు చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

నాలుగు రోజుల్లో మరో 120 పడకలు...

4 రోజుల్లో పీఎంఎస్​ఎస్​వై ఆస్పత్రిలో మరో 120 పడకలు కొవిడ్ బాధితుల కోసం అందుబాటులోకి రానున్నాయి. వేడుకలకు దూరంగా ఉండటం, మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం కచ్చితంగా పాటించడం, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం లాంటి జాగ్రత్తలు వైరస్ నిర్మూలనకు దోహదం చేస్తాయని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇవీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 1,982 కరోనా కేసులు... 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.