ETV Bharat / state

ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు సబబే - తీర్పు వెలువరించిన హైకోర్టు

ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు - ఉల్లంఘన జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడి

High Court On Indiramma Committees
High Court On Indiramma Committees (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

High Court On Indiramma Committees : ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల గుర్తింపునకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33 సబబేనని ఈ మేరకు హైకొర్టు పేర్కొంది. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్లకు అధికారాలను కల్పిస్తూ జారీ అయిన జీవో 33ను సవాలు చేస్తూ బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ, మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్​పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ నగేష్‌ భీమపాక ఇటీవల తీర్పును వెలువరించారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తూ గ్రామసభ, వార్డు సమావేశాలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడమనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గత సర్కారు డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పథకం లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేసిందన్నారు.

గ్రామసభల ద్వారానే అర్హుల ఎంపిక : ఇందిరమ్మ కమిటీల సభ్యుల నియామకాలకు సంబంధించిన జీవోలో(ఉత్తర్వుల్లో) ఎలాంటి అర్హతలను పేర్కొనలేదన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ జీవో 33 ప్రకారం ఇందిరమ్మ కమిటీల్లో గ్రామస్థాయిలో సర్పంచి/స్పెషల్ ఆఫీసర్, వార్డు స్థాయిలో కౌన్సిలర్‌/కార్పొరేటర్‌ ఛైర్మన్​గా ఉంటారని తెలిపారు.

ఎస్​హెచ్​జీ(స్వయం సహాయక గ్రూపులు) నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు స్థానికులను సభ్యులుగా ఉంటారని వివరించారు. లబ్ధిదారుల తుది జాబితా రూపొందించడం/తయారీలో ఇందిరమ్మ కమిటీల పాత్ర అంతిమం కాదని, గ్రామసభల ద్వారానే అర్హుల ఎంపిక అనేది జరుగుతుందన్నారు. దీనివల్ల పిటిషనర్ల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లబోదని వివరించారు.

ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు : వాదనలను విన్న న్యాయమూర్తి లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీల నిర్ణయమనేది అంతిమం కాదని, జిల్లా కలెక్టరుకు అందిన దరఖాస్తులపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డు స్థాయి అధికారి సర్వే నిర్వహిస్తారన్నారు. లబ్ధిదారుల గుర్తింపునకు ఇందిరమ్మ కమిటీలనేవి సాయం మాత్రమే చేస్తాయని, అర్హుల ఎంపికకు గ్రామసభలకు చట్టం అధికారం కల్పించిందన్నారు. అనర్హులను ఎంపిక చేస్తే పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పేద ప్రజలకు గుడ్​ న్యూస్​ - ఈ నెలాఖరు నుంచే 'ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ' ఎంపిక

ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేేసే వారికి గుడ్​న్యూస్​ - ఆ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.