విద్యార్థిని ఆత్మహత్యాయత్నం వరంగల్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. హన్మకొండలోని ఎస్ఆర్ ఇంటర్ కళాశాలకు చెందిన విద్యార్థిని రక్షరావు ఆర్డీ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసేందుకు వెళ్లింది. మాస్ కాపీయింగ్‌కి పాల్పడుతుండగా ఇన్విజిలేటర్ మందలించాడు. అవమానం భరించలేని ఆ అమ్మాయి మూడంతస్తుల భవనంపై నుంచి దూకింది. రెండు కాళ్లు విరిగిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఇవీ చదవండి:శిల్ప కళ బాగుంది... కల్లు రుచీ అదిరింది...!