వరంగల్ అర్బన్ జిల్లాలోని దర్గాకాజీపేట, ధర్మసాగర్ సహకార సంఘాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్రాలకు సిబ్బంది తమ సామగ్రితో చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరగనుండగా... సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. ధర్మసాగర్ మండల కేంద్రానికి సంబంధించి 13 స్థానాలకు గాను 5 స్థానాలు తెరాస అభ్యర్థుల ఏకగ్రీవం చేసుకోగా... మరో 8 స్థానాలకు పోటీ జరుగుతుంది.
కాజీపేట్ మండల కేంద్రానికి సంబంధించి 13 స్థానాలకు గాను 3 స్థానాలు ఏకగ్రీవం కాగా... మరో పది స్థానాలకు రేపు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చూడండి: మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్ర లక్ష్యం నెరవేరుతుంది : కేటీఆర్