ETV Bharat / state

కేటీఆర్​ గోబ్యాక్​ అంటూ ఫాతిమా వంతెనపై నిరసనలు - congress protest against minister ktr visit in warangal

మంత్రి కేటీఆర్​ వరంగల్​ పర్యటనకు వ్యతిరేకంగా వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట ఫాతిమా వంతెనపై జనగామ జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. కేసీఆర్​ రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

congress protest against minister ktr visit in warangal
కేటీఆర్​ గోబ్యాక్​ అంటూ ఫాతిమా వంతెనపై నిరసనలు
author img

By

Published : Jun 16, 2020, 8:32 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట ఫాతిమా వంతెనపై జనగామ జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మంత్రి కేటీఆర్​ వరంగల్​ పర్యటనను విమర్శిస్తూ కేటీఆర్​ గోబ్యాక్​ అంటూ నినాదాలు చేశారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే పెట్టి పర్యటనకు వస్తే అడ్డుకుని తీరుతామని ఆయన హెచ్చరించారు.

కాజీపేట రైల్వే ట్రాక్​పైనున్న వంతెనకు సమాంతరంగా మరో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభించట్లేదని రాఘవరెడ్డి ఆరోపించారు. రైతులకు రూ. రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని కేసీఆర్​ ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదని ఆయన ప్రశ్నించారు. తెరాస ఓ కుటుంబ పార్టీ అని ఆయన విమర్శించారు.

ఇదీ చూడండి : ఆరోగ్యమంత్రికి కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో చేరిక

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.